SSMB29: SSMB29 చిత్రం గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూమర్స్‌లో నిజం లేదని టీమ్ సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి. ఈ సినిమా రెండు భాగాలుగా రూ.1200 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోందన్న ఊహాగానాలను ఖండించాయి. ఇది ఒకే భాగంగా పూర్తయ్యే సినిమా అయినప్పటికీ, కథలో కీలక మలుపు ఉంటుందని, అది భవిష్యత్తులో సీక్వెల్‌కు అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ సీక్వెల్ నిర్ణయం కూడా సినిమా విజయం, ప్రేక్షకుల ఆదరణపైనే ఆధారపడి ఉంటుందట. ఈ చిత్రం భారతీయ సినిమా స్థాయిని అంతర్జాతీయంగా నిరూపించేలా భారీ స్కేల్లో తెరకెక్కుతోంది. నవంబర్‌లో జరిగే ప్రెస్ మీట్లో మహేష్ బాబు లుక్, కథకు సంబంధించిన కీలక అంశాలు వెల్లడికానున్నాయి. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా, పృథ్వీ రాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. KL నారాయణ ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు. మొత్తానికి అభిమానుల అంచనాలను మించి ఈ సినిమా ఓ అద్భుత అనుభవాన్ని అందించనుంది.
