Earthquake: గడిచిన వారం రోజులనుండి చుస్తే ఆఫ్ఘనిస్తాన్ లో వరుస భూప్రకంపనలతో వణికిపోతోంది. మూడు రోజుల క్రితం సంభవించిన భారీ భూకంపం మిగిల్చిన భయాందోళనలు ఇంకా మరవకముందే, మరోసారి భూకంపం చోటుచేసుకుంది. గురువారం ఉదయం రిక్టర్ స్కేల్‌పై 4.8 తీవ్రతతో భూకంపం నమోదై ప్రజలను కుదిపేసింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ప్రకారం, ఈ భూకంపం భూమి లోపల 135 కిలోమీటర్ల లోతులో సంభవించింది.
ఇదే కాక, బుధవారం రాత్రి కూడా 4.3 తీవ్రతతో మరో భూప్రకంపన చోటుచేసుకోవడంతో ప్రజలు ఆందోళనలోకి వెళ్లారు. వరుస భూకంపాలు రావడంతో భయాందోళనలు అధికమయ్యాయి. అధికారులు ఇంకా ఆస్తి, ప్రాణ నష్టంపై పూర్తి వివరాలు వెల్లడించలేదు.
ఇది కూడా చదవండి: Hyderabad Ganesh Immersion 2025: హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు
అదే సమయంలో, మయన్మార్‌లో కూడా గురువారం 4.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
గత ఆదివారం-సోమవారం అర్ధరాత్రి సమయంలో ఆఫ్ఘనిస్తాన్‌లో సంభవించిన భారీ భూకంపం పెద్ద ఎత్తున ప్రాణనష్టం మిగిల్చింది. ఆ ఘటనలో సుమారు 800 మంది మృతి చెందగా, 1400 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం గాయపడినవారికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. శిథిలాల తొలగింపు పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
వరుస భూప్రకంపనలు దేశ ప్రజల్లో మరింత భయాన్ని పెంచుతున్నాయి. అధికారులు పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ, సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు.
EQ of M: 4.8, On: 04/09/2025 10:40:56 IST, Lat: 34.38 N, Long: 70.37 E, Depth: 135 Km, Location: Afghanistan.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjcVGs @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/c52IhLhKSn— National Center for Seismology (@NCS_Earthquake) September 4, 2025