GHAATI Release Glimpse

GHAATI Release Glimpse: యాక్షన్ తో చితకకొట్టినా అనుష్క..

GHAATI Release Glimpse: అనుష్కశెట్టి ప్రధాన పాత్రలో నటించిన ‘ఘాటి’ రేపు (సెప్టెంబర్ 5) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో స్వీటీ దూరంగా ఉన్నా, డార్లింగ్ ప్రభాస్ ముందుకు వచ్చి ప్రమోషన్స్‌కి జోష్‌ నింపేశారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రభాస్ స్వయంగా రిలీజ్ గ్లింప్స్‌ రిలీజ్ చేయడం అభిమానుల్లో హైప్ క్రియేట్ చేసింది.

క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాలో అనుష్క శెట్టి లేడీ ఓరియెంటెడ్ రోల్‌లో అలరించనుంది. విక్రమ్ ప్రభు, జగపతిబాబు, చైతన్యరావు, విటివి గణేష్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదలవుతోంది.

ప్రభాస్ రంగంలోకి – సపోర్ట్ మోడ్ ఆన్!

‘ఘాటి’ ప్రమోషన్స్‌ కి స్వీటీ పూర్తిగా ఆన్‌లైన్ ప్రమోషన్స్‌కే పరిమితం కాగా, ప్రభాస్ మాత్రం నేరుగా రంగంలోకి దిగారు. యూవీ క్రియేషన్స్ అంటే ప్రభాస్ సొంత బ్యానర్‌ లాగానే. అందుకే సెప్టెంబర్ 4న ఉదయం 11:16 గంటలకు విడుదల కావాల్సిన గ్లింప్స్‌ని కాస్త ఆలస్యంగా రిలీజ్ చేస్తూ అభిమానులను ఎగ్జైట్ చేశారు.

ఇది కూడా చదవండి: Pawan Kalyan: జీఎస్టీ సంస్కరణలు: ప్రజలకు గొప్ప ఉపశమనం – పవన్ కల్యాణ్

గ్లింప్స్ హైలైట్స్

1.21 నిమిషాల ఈ రిలీజ్ గ్లింప్స్‌లో అనుష్క యాక్షన్ షాట్స్ మైండ్‌బ్లోయింగ్‌గా ఉన్నాయి. కర్రతిప్పే సీన్, కొడవలి పట్టుకుని బస్సు వెనకాల నడిచే షాట్, తలను పట్టుకుని నడిచే సీన్— మొత్తం కళ్లముందు పీరియడ్ యాక్షన్ డ్రామా గ్రాండ్యూర్‌ని చూపించాయి. క్రిష్ దర్శకత్వ ప్రతిభకు అద్దం పట్టిన ఈ విజువల్స్ ఫ్యాన్స్‌లో హైప్‌ను రెట్టింపు చేశాయి.

అనుష్క తిరిగి రాక

‘బాహుబలి’, ‘అరుంధతి’, ‘వేదం’, ‘రుద్రమదేవి’, ‘మిర్చి’ వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన అనుష్క, లాంగ్ గ్యాప్ తర్వాత  ‘ఘాటి’తో థియేటర్స్‌లోకి వస్తోంది. ఆమె యాక్షన్ అవతారాన్ని చూడటానికి ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *