Placard

Placard: మేము GST రోడ్డు టాక్స్‌లు కట్టాలి.. కానీ రోడ్లే సరిగా లేవు..మీరు నాకెంత ఫైన్ కడతారు?

Placard: కరీంనగర్ జిల్లా రేకుర్తి చౌరస్తా వద్ద ఒక వ్యక్తి వినూత్న రీతిలో నిరసన తెలుపుతూ అందరి దృష్టిని ఆకర్షించారు. “రోడ్డు పైన నేను ఏది ధరించకపోయినా ఫైన్ కడుతున్నాను… GSTలు, రోడ్డు టాక్స్‌లు కడుతున్నాను… కానీ అసలు రోడ్లే సరిగా లేవు. మరి మీరు నాకెంత ఫైన్ కడతారు?” అని ప్రశ్నిస్తూ  అని ప్లకార్డు పట్టుకొని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

రోడ్డుల దుస్థితిపై కోట శ్యామ్ కుమార్ ఆగ్రహం

కోట శ్యామ్ కుమార్ అనే యువకుడు ఈ నిరసనను చేపట్టారు. కరీంనగర్-నిజామాబాద్ నేషనల్ హైవేగా గుర్తింపు పొందిన ఈ మార్గంలో, రేకుర్తి చౌరస్తా వద్ద రోడ్డు పరిస్థితి గత కొన్నేళ్లుగా అధ్వానంగా ఉందని ఆయన ఆరోపించారు. “ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు గానీ, రాజకీయ నాయకులు గానీ పట్టించుకోలేదు. కానీ మేము మాత్రం పన్నులు, ఫైన్లు క్రమం తప్పకుండా చెల్లించాల్సిందే” అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Crime News: కొంప ముంచిన రీల్స్.. రెండో భార్యతో ఇన్‌స్టా రీల్స్‌.. తాటతీసిన ఫస్ట్ వైఫ్

ప్లకార్డుతోనే ప్రజల్లో చైతన్యం

రోడ్డుపై కూర్చుని ప్లకార్డుతో నిరసన తెలపడం ద్వారా శ్యామ్ కుమార్ ప్రజల దృష్టిని ఆకర్షించారు. స్థానికులు ఆయనకు మద్దతు తెలుపుతూ, ఈ రోడ్డును తక్షణం మరమ్మతు చేయాలని అధికారులను డిమాండ్ చేశారు.

అధికారుల స్పందన కోసం వేచి చూస్తూ…

ఈ నిరసన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కలెక్టర్, పోలీస్ కమిషనర్ దృష్టికి ఈ అంశం వెళ్లడంతో రోడ్డు మరమ్మతులపై చర్యలు తీసుకుంటారా అనే ఉత్కంఠ పెరిగింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *