Pawan Kalyan: కొణిదెల కళ్యాణ్ బాబు.. 1971లో బాపట్లలో ఓ సామాన్య మధ్య తరగతి కుటుంబంలో పుట్టి.. పెద్దగా కోరికలు, లక్ష్యాలు లేకుండా.. అత్యంత సామాన్యంగా పెరిగి పెద్దయి.. అన్నయ్య చేయందిస్తే.. తన ప్రయాణం మొదలుపెట్టి.. తనకంటూ సొంత ఐడెంటిటీ క్రియేట్ చేసుకుని.. స్వయంకృషి, స్వశక్తితోనే ఎదిగి.. సినిమాల్లో పవర్ స్టార్‌గా, రాజకీయాల్లో పవర్‌ఫుల్ లీడర్‌గా, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఎదిగిన… ధైర్యం, నిజాయితీ, నిస్వార్థ సేవల కలబోత.. పవన్ కళ్యాణ్. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ రంగంలో అడుగుపెట్టి.. 1996లో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’తో తెరంగేట్రం చేసిన పవన్, ‘ఖుషి’, ‘గబ్బర్ సింగ్’ లాంటి చిత్రాలతో తెలుగు సినిమా రంగంలో అజేయ శక్తిగా మారాడు. అతని సహజ నటన, అభిమానులను ఆకర్షించే విలక్షణ శైలి, సామాజిక సమస్యలను ప్రస్తావించే కథల ఎంపిక అతన్ని పవర్ స్టార్‌గా నిలిపాయి.
సినిమాలతో పాటు, పవన్‌లోని… సామాన్యుడి కష్టాన్ని అర్థం చేసుకునే గుణం, అణచివేతకు వ్యతిరేకంగా తిరగబడే తత్వం అతన్ని రాజకీయాల్లోకి ఆకర్షించాయి. 2008లో ప్రజారాజ్యం పార్టీ యువజన విభాగ అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానం మొదలైంది. 2014లో జనసేన పార్టీ స్థాపించి, ఉద్దానం కిడ్నీ సమస్యలాంటి సామాజిక అంశాలపై గళమెత్తి, ప్రజల గుండెల్లో చోటు సంపాదించాడు. 2024 ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాడు. కూటమి విజయంలో పవన్ వ్యూహాత్మక నాయకత్వమే కీలకం.
Also Read: Thummala Nageswara Rao: తెలంగాణలో రైతుల యూరియా కష్టాలపై తుమ్మల స్పందన
పవన్‌లోని నిజాయితీ, డబ్బు సంపాదన పట్ల ఆసక్తిలేని స్వభావం, అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం అతన్ని ప్రత్యేకంగా నిలిపాయి. పవన్‌లోని ప్రత్యేకతలు అతన్ని ప్రజలకు దగ్గర చేశాయి. ఆ తెగింపు, నిబద్ధత చూసి.. సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోడీ “ఇతను పవన్ కాదు, తుపాన్” అని కొనియాడారంటేనే అర్థం చేసుకోవచ్చు. సామాన్యుడి కష్టాన్ని చూసి స్పందించే గుణం, డబ్బు మీద ఆశలేక పోవడం, నిస్వార్థం, నిప్పు లాంటి నిజాయితీ, అణచివేతని ఎదిరించే స్వభావం, బానిసత్వానికి వ్యతిరేకంగా తిరగబడే తత్వం, ధైర్యం, తెగింపు, పవన్ కళ్యాణ్‌లో ఉన్న అరుదైన లక్షణాలు, ప్రత్యేకతల వల్లే అటు సినిమాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ ఇంతటి ఘన విజయాలు సాధ్యం అయ్యాయి. ఈ గుణాలే కళ్యాణ్ బాబుని పవర్ స్టార్‌గా, జనసేన నాయకుడిగా, రాష్ట్ర నాయకుడిగా నిలబెట్టాయి.

