Ch Mallareddy: రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి ఈడీ అధికారులు గురువారం నోటీసులు అందజేశారు. నిరుడు జూన్ నెలలో మల్లారెడ్డి సంస్థలపై ఈడీ అధికారులు సోదాలు జరిపారు. పీజీ మెడికల్ సీట్ల అక్రమాలపై నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. పీజీ మెడికల్ సీట్లను అక్రమంగా బ్లాక్ చేశారనే అభియోగంపై వివరణ కోరుతూ ఈ నోటీస్‌ను సర్వ్ చేసినట్టు తెలిసింది. రాష్ట్రంలో మొత్తం 10 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 45 సీట్లను బ్లాక్ చేసి అమ్ముకున్నట్టు ఈడీ అధికారులు గుర్తించినట్టు సమాచారం.
