Afghanistan Earthquake

Afghanistan Earthquake: మరోసారి మానవత్వం చాటుకున్న భారత్.. భూకంపంతో అల్లాడుతున్న అఫ్గాన్ కు చేయూత

Afghanistan Earthquake: మరోసారి మానవత్వం చాటుకున్న భారత్.. తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లో ఆదివారం సంభవించిన విధ్వంసకర భూకంపం 1,400 మందికిపైగా ప్రాణాలు బలి తీసుకుంది. 6.0 తీవ్రతతో వచ్చిన ఈ ప్రకంపనలు నంగర్హార్ ప్రావిన్స్‌లోని జలాలాబాద్ నగరానికి ఈశాన్యంగా 27 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై, అనేక గ్రామాలు శిథిలావస్థకు చేరాయి. వేలాది మంది గాయపడగా, సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో భారత్ మానవతా సహాయ హస్తం చాపింది. మొత్తం 21 టన్నుల సహాయ సామగ్రిని ప్రత్యేక విమానంలో కాబూల్‌కు తరలించింది. దుప్పట్లు, టెంట్లు, వైద్య పరికరాలు, పరిశుభ్రత కిట్లు, నీటి నిల్వ ట్యాంకులు, జనరేటర్లు, వంట సామగ్రి, స్లీపింగ్ బ్యాగులు, పోర్టబుల్ వాటర్ ప్యూరిఫైయర్లు, వీల్‌చైర్లు, అవసరమైన మందులు, ORS సొల్యూషన్లు వంటి అత్యవసర సామాగ్రి ఇందులో ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Kalvakuntla Kavitha: కవిత కీలక నిర్ణయం.. తండ్రి కి పోటీగా కొత్త పార్టీ..?

“భారత సహాయం కాబూల్ చేరుకుంది. భూకంప బాధితులకు అవసరమైన మానవతా సహాయం అందించడంలో భారత్ ఎల్లప్పుడూ ముందుంటుంది” అని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ ‘X’లో తెలిపారు. భూకంపం ప్రభావాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ, రాబోయే రోజుల్లో మరిన్ని సహాయ సరకులు పంపేందుకు సన్నద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు భారత్ తరఫున మద్దతు ప్రకటించారు. “అత్యవసర సహాయం అందించడానికి భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది” అని ప్రధాని తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *