AAP MLA Arrested: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పఠాన్‌మజ్రా పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నారు. మంగళవారం (సెప్టెంబర్ 2) ఉదయం హర్యానాలోని కర్నాల్ నుంచి అరెస్టు చేసిన తర్వాత, పోలీసులు అతన్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తుండగా, పఠాన్‌మజ్రా, అతని సహచరులు పోలీసులపై కాల్పులు జరిపారు, ఈ ఘటనలో ఒక పోలీసు గాయపడ్డాడు. పఠాన్‌మజ్రా, అతని సహచరులు స్కార్పియో, ఫార్చ్యూనర్‌లో పారిపోయారు. పోలీసులు ఫార్చ్యూనర్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్కార్పియోలో పరారీలో ఉన్న ఎమ్మెల్యేను వెంబడిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Rashid Khan: రషీద్ ఖాన్ స్టన్నింగ్ రికార్డు
పంజాబ్‌లోని పాటియాలా జిల్లాలోని సనౌర్ నియోజకవర్గ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పఠా న్‌మజ్రాను అత్యాచారం, మోసం ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేశారు. పఠాన్‌మజ్రా తనతో పెళ్లి కాకముందు మరో మహిళతో విడాకులు తీసుకున్నట్లు తప్పుగా చూపించాడని ఆరోపిస్తూ జిరాక్‌పూర్‌కు చెందిన ఓ మహిళ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఆయనను అరెస్టు చేశారు. 2021లో వివాహం చేసుకున్నప్పటికీ అతను తనను వివాహం చేసుకున్నాడని, లైంగికంగా వాడుకున్నాడని అశ్లీల సందేశాలను పంపాడని, బెదిరింపులు పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. పఠాన్‌మజ్రాపై ఉన్న ఎఫ్‌ఐఆర్‌లో అత్యాచారం, మోసం, క్రిమినల్ బెదిరింపుల అభియోగాలు ఉన్నాయి.