Cm chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు, సంక్షేమంపై ముఖ్య వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, మన ప్రభుత్వంలో జీతాలు, పెన్షన్లు సకాలంలో అందిస్తున్నాం అని స్పష్టం చేశారు. సూపర్ సిక్స్‌లో భాగంగా కేవలం 15 నెలల్లోనే ₹42 వేల కోట్లను ప్రజలకు అందించామన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నోమందికి మేలు జరిగిందని గుర్తుచేశారు.
వైసీపీపై సవాల్ విసిరిన చంద్రబాబు, “అసెంబ్లీకి రండి, సంక్షేమం–అభివృద్ధి అంశాలపై బహిరంగ చర్చిద్దాం. వైసీపీ ఒక ఫేక్ పార్టీ” అని తీవ్ర స్థాయిలో విమర్శించారు.

