RCB: జూన్‌లో బెంగళూరులో జరిగిన తొక్కిసలాట సంఘటన తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఆరు పాయింట్ల మానిఫెస్టోను విడుదల చేసింది. ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన అభిమానుల జ్ఞాపకాలను గౌరవించడంతోపాటు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా నివారించడానికి ఈ మానిఫెస్టోను రూపొందించారు.
RCB యొక్క ఆరు పాయింట్ల మానిఫెస్టో:
ఆర్థికసాయాన్ని మించి అభిమానులకు మద్దతుగా నిలవడం. జట్టు వల్ల ఇబ్బందిపడే అభిమానులు, వారి కుటుంబానికి పారదర్శకంగా, వేగంగా అందేలా చేయడం.
సురక్షితంగా ఉండేలా భద్రతా చర్యలు తీసుకుంటాం. స్టేడియాల అధికారులు, క్రీడా సంబంధిత సంఘాలు, లీగ్ భాగస్వాములతో కలిసి పనిచేస్తాం. భారీగా వచ్చే ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం.
గొప్ప అవకాశాలను సృష్టించి సంఘాలను బలోపేతం చేయడం, అందుకోసం సామాజిక అభివృద్ధి కార్యక్రమాలను గ్రామీణ కర్ణాటకలో అమలుచేసేందుకు ప్రయత్నాలు.
ఇది కూడా చదవండి: Hat Trick Wickets: అంతర్జాతీయ క్రికెట్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన 8 మంది బౌలర్లు వీరే!
భారీగా తరలివచ్చే అభిమానుల భద్రత కోసం స్వతహాగా పరిశోధిస్తాం. అందుకోసం ఇన్వెస్ట్ చేసేందుకు అడుగులు వేస్తాం. అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలనే దానిపై ఎప్పటికప్పుడు వర్కౌట్ చేయడం.
అభిమానులకు గుర్తుండిపోయేలా నిర్ణయాలు తీసుకోవడం. వారి గౌరవార్థం బెంగళూరులోని పలు ప్రాంతాల్లో అంకితమిచ్చేలా కార్యాచరణను రూపొందిస్తాం. ఆర్సీబీ స్ఫూర్తిని కొనసాగిస్తాం.
క్రీడల్లో భావితరాలకు అండగా నిలుస్తాం. స్థానిక టాలెంట్‌ను గుర్తిస్తాం. ఆర్థిక, అవకాశాలపరమైన మద్దతు ఇస్తాం. రాబోయేతరంలో ఉన్నతస్థాయికి చేరుకొనేందుకు సహకరిస్తాం.
ఈ మానిఫెస్టోను విడుదల చేయడానికి కొన్ని రోజుల ముందు, ఈ సంఘటనలో ప్రభావితమైన ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని RCB ప్రకటించింది. ఈ చర్యలు అభిమానుల భద్రతకు, భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు జరగకుండా నివారించడానికి తమ నిబద్ధతను తెలియజేస్తున్నాయని RCB తెలిపింది.