Pawan Kalyan: తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ప్రముఖ అధ్యాయంగా నిలిచిన ఘట్టం ఇదే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించి నేటికి 30 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
“రాష్ట్ర అభివృద్ధి పట్ల మీ అంకితభావం భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుంది. సమగ్ర అభివృద్ధి సాధించాలన్న మీ దూరదృష్టి భావితరాలకు స్ఫూర్తి. భవిష్యత్తులోనూ మీరు మరిన్ని విజయాలను సాధించాలని కోరుకుంటున్నా,” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: AP Pensions: ఏపీ వ్యాప్తంగా పింఛన్ల పంపిణి.. ఇప్పటికే 60% పింఛన్ల పంపిణీ పూర్తి
1995లో మొదటిసారి సీఎం బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు, టెక్నాలజీ ఆధారిత పాలన, హైదరాబాదును ఐటీ హబ్‌గా మార్చిన దూరదృష్టితో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, పంచాయతీ స్థాయి పాలనలో సాంకేతికత వినియోగం వంటి పలు సంస్కరణలకు ఆయన పునాది వేశారు.
ప్రస్తుతం రాష్ట్రానికి తిరిగి ముఖ్యమంత్రిగా సేవలందిస్తున్న చంద్రబాబు, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. రాజకీయాల్లో మూడు దశాబ్దాలకుపైగా అనుభవం, పరిపాలనలో నూతన ఆవిష్కరణల పట్ల ఆయన చూపిన కట్టుబాటు ఆయన నాయకత్వాన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి.