Poland: పోలండ్ దేశంలో వైమానిక ప్రదర్శన నిర్వహణకు ముందుగా రిహార్సల్స్ చేస్తుండగా, పోలిష్ వైమానిక దళానికి చెందిన ఎఫ్-16 విమానం కుప్పకూలింది. నియంత్రణ కోల్పోయిన విమానం పైనుంచి నిప్పులు కక్కుతూ నేలపై కూలి పూర్తిగా దెబ్బతిన్నది. ఈ ప్రమాదంలో పైలెట్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ప్రమాదానికి సాంకేతిక కారణాలను ప్రాథమికంగా వెల్లడించినా, పూర్తిస్థాయి విచారణ అనంతరం కారణాలను వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
Poland: పోలిష్ వైమానిక దళానికి చెందిన ఈ విమానం పోలండ్ దేశంలోని పోజ్నాన్ సమీపంలోని 31వ టాక్టికల్ ఎయిర్‌బేస్ వద్ద ఈ ప్రమాదానికి గురైంది. అక్కడే ఉన్న పలువురు సాయుధ దళాల సిబ్బంది ఉన్నా ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సైన్యాధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో చనిపోయిన పైలెట్ పోలిష్ ఆర్మీకి చెందిన వ్యక్తిగా పేర్కొన్నారు. పైలెట్ మృతికి పోలండ్ సైన్యం సంతాపం తెలిపింది.

