Cm revanth: రాష్ట్రంలో కొనసాగుతున్న వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం మెదక్ ఎస్పీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సుమారు 45 నిమిషాల పాటు కలెక్టర్, ఎస్పీ, ఉన్నతాధికారులతో సమావేశమై వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని సమీక్షించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, “ఇంకా వరద ముప్పు పూర్తిగా తగ్గలేదు. అందువల్ల అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిందే” అని స్పష్టం చేశారు.
ప్రభావిత ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతులు ఎదుర్కొన్న పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి నివేదిక ఇవ్వాలని సూచించారు. అలాగే, రోడ్లు తెగిన చోట యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసి, రవాణా సౌకర్యం పునరుద్ధరించాలని సీఎం రేవంత్ ఆదేశించారు.