Indian Railways: ప్రస్తుతం మన దేశంలో పండుగల సీజన్ నడుస్తోంది. దీపావళి తర్వాత ఇప్పుడు ఛత్ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. పండుగల దృష్ట్యా, భారతీయ రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తూ వస్తోంది. రైల్వేశాఖ చేస్తున్న ప్రత్యేక ఏర్పాట్లను సద్వినియోగం చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు స్టేషన్‌లకు వస్తే ఆటోమేటిక్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ అవుతోంది. ఈ ఏడాది కూడా అలాంటిదే జరిగింది. నవంబర్ 4, 2024న ఒక్కరోజే 3 కోట్ల మంది ప్రయాణికులు రైలులో ప్రయాణించారు. ఇది అతి పెద్ద రికార్డ్.
ఇది కూడా చదవండి: CPCB: లాన్సెట్ రిపోర్ట్ పూర్తిగా తప్పు.. పొల్యూషన్ బోర్డు అభ్యంతరం
Indian Railways: ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఆరోజున రైళ్లలో ప్రయాణించిన వారి సంఖ్య ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల మొత్తం జనాభా కంటే ఎక్కువ. నవంబర్ 4న రైలులో ప్రయాణించిన ప్రయాణికుల్లో 19.43 లక్షల మంది రిజర్వ్‌డ్ కేటగిరీలో ప్రయాణించగా, 1,01,29,000 మంది అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీలో ప్రయాణించారు. కాగా అదే రోజు సబర్బన్ రైల్వేలో 1 కోటి 80 లక్షల మంది ప్రయాణించారు. ప్రధాన స్టేషన్లలో భారతీయ రైల్వేలు చేసిన విస్తృత ఏర్పాట్లు, ప్రత్యేక రైళ్ల నిర్వహణ ఈ రికార్డ్ సృష్టించడంలో సహాయపడింది.
Indian Railways: భారతీయ రైల్వే 2024 సంవత్సరంలో 7700 కంటే ఎక్కువ ప్రత్యేక రైళ్లను నడపాలని ప్లాన్ చేసింది. గత ఏడాది భారతీయ రైల్వేలు 4429 ప్రత్యేక రైళ్లను నడిపాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 73 శాతం ఎక్కువ ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే ప్లాన్ చేసింది.