Kunamneni sambhasivarao: RTC కార్మికుల కోసం ఉద్యమాలకు సిద్ధం

Kunamneni sambhasivarao: ఆర్టీసీని కాపాడుకునేందుకు నిరంతర పోరాటాలకు సిద్ధమవుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. గురువారం ఆయన హైదరాబాద్‌లోని ముఖ్దూమ్ భవన్లో మీడియాతో మాట్లాడారు.

సాంబశివరావు మాట్లాడుతూ –

“సజ్జనార్ ముఖ్యమంత్రినా..? మంత్రినా..? ఎండీనా..? కార్మికుల పట్ల ఆయన నియంతలా వ్యవహరిస్తున్నారు. సజ్జనార్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ కావొచ్చు, కానీ అట్లాంటి భయానక వాతావరణం ఆర్టీసీ కార్మికులపై సృష్టించడం సరైంది కాదు” అని మండిపడ్డారు.

సజ్జనార్ పద్ధతి మారకపోతే ఆయనపై ప్రత్యేక ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.

సీపీఐ నాలుగో రాష్ట్ర మహాసభలు ఘనంగా ముగిసాయని ఆయన తెలిపారు.

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై పోరాటాలు చేస్తామని ప్రకటించారు.

ఇరిగేషన్ ప్రాజెక్టులు, రైతాంగ సమస్యలపై ఉద్యమాలు ఉధృతం చేస్తామని అన్నారు.

పేదల ఇండ్ల కూల్చివేతలపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచించారు.

తదుపరి కార్యక్రమాల వివరాలు:

నవంబర్ 11–17: తెలంగాణ వారోత్సవాలు జరపనున్నట్లు తెలిపారు.

డిసెంబర్ 26: కమ్యూనిస్టు పార్టీ శతజయంతి సందర్భంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ.

తెలంగాణ సాయుధ పోరాట త్యాగాలను ప్రభుత్వం గుర్తించాలని, సాయుధ వారోత్సవాలను అధికారికంగా జరపాలని డిమాండ్ చేశారు.

ఈ నెల 30న: సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ రవీంద్రభారతిలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సభకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించినట్లు చెప్పారు.

ఎన్నికల విషయంలో –

స్థానిక సంస్థల ఎన్నికల్లో వీలైనన్ని స్థానాల్లో పోటీ చేస్తామని అన్నారు.

కాంగ్రెస్, సీపీఎం కలిసి పోటీ చేసే చోట కలిసి, లేకపోతే ఒంటరిగా బరిలో దిగుతామని స్పష్టం చేశారు.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *