Kamala harris: ఫలితాలపై స్పందించిన కమల హ్యారీస్

Kamala harris:  అమెరికా ఎన్నికల ఫలితాలపై అధ్యక్ష అభ్యర్థి కమల ప్యారిస్ స్పందించారు.ప్ర‌భుత్వ ఏర్పాటుకు, అధికార మార్పిడికి స‌హ‌క‌రించ‌నున్న‌ట్లు క‌మ‌లా హారిస్ తెలిపారు.అధికార మార్పిడి శాంతియుతంగా జ‌రిగేందుకు ట్రంప్‌న‌కు స‌హ‌క‌రించ‌నున్న‌ట్లు ఆమె వెల్ల‌డించారు. హోవ‌ర్డ్ యూన‌వ‌ర్సిటీలో ఆమె త‌న మ‌ద్ద‌తుదారుల‌తో భావోద్వేగంగా మాట్లాడారు. ఫ‌లితాల‌ను ఆమోదించాల‌ని ఆమె అభిమానుల‌ను కోరారు. దేశ ఆద‌ర్శాల‌ను ర‌క్షించేందుకు పోరాడాల‌న్నారు.

త‌న మ‌న‌సు సంతోషంతో నిండి ఉన్న‌ద‌ని, మీరు నాపై చూపిన న‌మ్మ‌కానికి కృత‌జ్ఞ‌త‌తో ఉన్న‌ట్లు ఆమె తెలిపారు. విజ‌యం సాధించిన ట్రంప్‌తో మాట్లాడాన‌ని, ఆయ‌న‌కు కంగ్రాట్స్ చెప్పిన‌ట్లు ఆమె వెల్ల‌డించారు. ట్రంప్‌కు, ఆయ‌న టీమ్‌కు హెల్ప్ చేస్తాన‌ని చెప్పాన‌ని, శాంతియుతంగా అధికారాన్ని బ‌దలాయిస్తామ‌న్నారు.అమెరికా ఆశాజ్యోతి దివ్యంగా వెలుగుతుంద‌ని హారిస్ తెలిపారు.

కాగా,రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించడం తెలిసిందే. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ పై ఆయన గెలుపొందారు. మ్యాజిక్ ఫిగర్ 270ని దాటడంతో ట్రంప్ గెలుపు ఖరారైంది.

కీలకమైన స్వింగ్ రాష్ట్రాల్లో (ఇరు పార్టీలకు సమాన బలం ఉండే రాష్ట్రాలు) ట్రంప్ దే పైచేయి అయింది. ట్రంప్ కు 277 ఎలక్టోరల్ ఓట్లు రాగా, కమలా హారిస్ 224 ఓట్లు సాధించారు. కాగా, ట్రంప్ ఇంకా మరో మూడు రాష్ట్రాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు

.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *