Mohan Babu

Mohan Babu: మహేష్ బాబు అన్న కొడుకుకి విల‌న్ గా మోహ‌న్ బాబు..

Mohan Babu: టాలీవుడ్‌లో కొత్త తరం ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ హీరోగా వెండితెరపై పరిచయం కానున్నారు. ఈ చిత్రానికి ఆర్‌.ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 15న ఈ ప్రాజెక్ట్‌ను ఘనంగా ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం తారాగణం, సాంకేతిక బృందం ఎంపిక దశలో ఉన్నట్టు సమాచారం.

ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్ స్టార్ రవీనా టాండన్ కుమార్తెను పరిచయం చేస్తున్నారు. అసలుగా రవీనా కుమార్తెను బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ డెబ్యూ చిత్రంలో హీరోయిన్గా తీసుకురావాలని భావించారు. అప్పట్లో ఫోటో షూట్ కూడా జరిగింది. కానీ ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగకపోవడంతో, ఇప్పుడు ఘట్టమనేని వారసుడితో తెరంగేట్రం చేయబోతోంది.

ఇది కూడా చదవండి: Nivetha Pethuraj: పెళ్లిపీటలు ఎక్కనున్న నివేదా.. సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్.. ఫోటోలు వైరల్

ఇక ఈ సినిమాకు మరో స్పెషల్ హైలైట్‌ – విలన్ పాత్ర. ఈ కీలక పాత్ర కోసం పలువురిని పరిశీలించిన తర్వాత, చివరికి ఎంపిక కలెక్షన్ కింగ్ మోహన్ బాబు దగ్గరే ఆగింది. ఈ విషయమై చిత్రబృందం మోహన్ బాబుతో చర్చలు జరిపిందని, ఆయ‌న కూడా ఈ పాత్రలో నటించేందుకు అంగీకరించినట్టు టాక్ వినిపిస్తోంది. నిజంగానే మోహన్ బాబు విలన్‌గా స్క్రీన్‌పై కనిపిస్తే, ఈ సినిమా హైప్ మరింత పెరిగే అవకాశముంది.

సినిమాకు “శ్రీనివాస మంగాపురం” అనే టైటిల్‌ను పరిశీలనలో ఉంచారు. ప్రేమకథను ఆధారంగా చేసుకుని, యాక్షన్‌, గ్రామ కక్షలు వంటి అంశాలను జోడిస్తూ, క్లైమాక్స్‌ను షాకింగ్‌గా రూపొందించారని తెలుస్తోంది.

మరిన్ని ఆసక్తికరమైన వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయ. 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *