Sachin-Joe Root

Sachin-Joe Root: అప్పుడే జో రూట్ పెద్ద ప్లేయర్ అవుతాడనుకున్నా: సచిన్

Sachin-Joe Root: టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగుల ప్రపంచ రికార్డుకు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జో రూట్ దగ్గరవుతున్న నేపథ్యంలో, భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ స్పందించారు. ఈ విషయంపై సచిన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ రెడిట్లో ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్‌లో తన అభిప్రాయాలను పంచుకున్నారు. టెస్ట్ క్రికెట్‌లో 13,000 పరుగులు దాటడం ఒక అసాధారణమైన ఘనత అని సచిన్ ప్రశంసించారు. “అతడు ఇప్పటికీ బలంగా ఆడుతున్నాడు. నేను అతన్ని (జో రూట్‌ను) 2012లో నాగ్‌పూర్‌లో అతని తొలి టెస్ట్ మ్యాచ్‌లో మొదటిసారి చూసినప్పుడు, నా సహచర ఆటగాళ్లతో అతడు భవిష్యత్తులో ఇంగ్లాండ్ కెప్టెన్ అవుతాడని చెప్పాను” అని సచిన్ గుర్తు చేసుకున్నారు. వికెట్‌ను అంచనా వేయడంలో, స్ట్రైక్‌ను రొటేట్ చేయడంలో అతను చూపించిన పద్ధతి నన్ను బాగా ఆకట్టుకుంది.

Also Read: Michael Clarke: మైఖేల్ క్లార్క్ కు చర్మ క్యాన్సర్‌.. ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు

ఆ క్షణమే అతను ఒక గొప్ప ఆటగాడు అవుతాడని నాకు అనిపించిందని సచిన్ తెలిపారు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగుల జాబితాలో సచిన్ టెండూల్కర్ 15,921 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. జో రూట్ ప్రస్తుతం 13,543 పరుగులతో రెండవ స్థానంలో ఉన్నాడు. సచిన్ రికార్డును అధిగమించడానికి రూట్‌కు ఇంకా 2,378 పరుగులు అవసరం. టెస్ట్ సెంచరీల రికార్డులో సచిన్ (51 సెంచరీలు) తర్వాత జో రూట్ (39 సెంచరీలు) నాలుగో స్థానంలో ఉన్నారు. అంతేకాకుండా, స్వదేశంలో అత్యధిక టెస్ట్ సెంచరీలు (24) సాధించి సచిన్ టెండూల్కర్ రికార్డు (22 సెంచరీలు)ను రూట్ అధిగమించారు. 34 ఏళ్ల వయస్సులో కూడా జో రూట్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నందున, సచిన్ ప్రపంచ రికార్డును రూట్ బద్దలు కొట్టే అవకాశం ఉందని చాలా మంది క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Rohit Sharma: T20 క్రికెట్‌లో రోహిత్ కొత్త రికార్డు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *