Pushpa 2

Pushpa 2: పుష్ప -2పై సరికొత్త వివాదం

Pushpa 2: ఉత్తరాది నిర్మాతలకు దక్షిణాది చిత్రాల విజయంపై అక్కసు ఉండటం సహజం. కానీ ఇప్పుడు దక్షిణాది నిర్మాతలు సైతం పక్క రాష్ట్రాల చిత్రాలపై ద్వేషాన్ని వెలిబుచ్చుతున్నారు. తమ చిత్రాలను ఆదరించని రాష్ట్రాల నుండి వచ్చే సినిమాలను తామూ ఆదరించకూడదనే ఆలోచన చేస్తున్నారు. అలా ‘పుష్ప-2’పై కర్ణాటకలో నిరసన సెగ ఒకటి మొదలెట్టారు.

ఇవాళ దేశ వ్యాప్తంగా అందరూ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న సినిమా ‘పుష్ప-2’. మరో నెల రోజుల్లో జనం ముందుకు రాబోతున్నామంటూ మైత్రీమూవీ మేకర్స్ సంస్థ మంగళవారం ‘పుష్ప-2’ నుండి సరికొత్త పోస్టర్ ను విడుదల చేసింది. దీనిని చూసి ఐకాన్ స్టార్ అభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగి తెలుతున్నారు. అయితే… ఇదే సమయంలో పక్కనే ఉన్న కర్ణాటకలో ‘పుష్ప-2’ జైత్రయాత్రను ఎలా అడ్డుకోవాలా? అనే పథక రచన జరుగుతున్నట్టు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Ramayana: రెండు పార్టులుగా రామాయణ.. రిలీజ్ డేట్స్ ఫిక్స్

Pushpa 2: ‘పుష్ప’ సినిమా నిజానికి ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైంది. చిత్రం ఏమంటే… రెండు తెలుగు రాష్ట్రాల కంటే… ఇతర రాష్ట్రాలలోనే ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభించింది. మరీ ముఖ్యంగా ఈ కథ ఇటు తెలుగుతో పాటు అటు తమిళ, కర్ణాటక రాష్ట్రాలలోని ఎర్ర చందనం స్మగ్లింగ్ కు సంబంధించింది కావడంతో వారూ బాగా కనెక్ట్ అయ్యారు. కర్ణాటక పంపిణీ దారులు చెప్పిన ప్రకారం ‘పుష్ప’ తొలి భాగం 18 కోట్ల నుండి 20 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. అక్కడ తెలుగు వర్షన్ విడుదలైన వారం తర్వాత కన్నడ వర్షన్ ను రిలీజ్ చేశారు. దాంతో కన్నడ డామినేషన్ ఏరియాల్లోకి ఈ సినిమా శరవేగంగా దూసుకుపోలేకపోయింది. అయితే ఇప్పుడా లోటు లేకుండా చూస్తామని కన్నడ వర్షన్ ను కూడా డిసెంబర్ 5నే విడుదల అవుతుందని మైత్రీ మూవీ మేకర్స్ వారు హామీ ఇచ్చారు. దాంతో ఈ సినిమాను కర్నాటకలో పంపిణీ చేస్తున్న లక్ష్మీ కాంత్ రెడ్డి సరికొత్త రికార్డులను ‘పుష్ప-2’ సాధించడం ఖాయమంటున్నారు.

కన్నడనాట ఇంతవరకూ అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన తెలుగు సినిమాగా ‘బాహుబలి-2’ నిలిచింది. ఈ రికార్డును ‘పుష్ప-2’ ఖచ్చితంగా అధిగమిస్తుందని లక్ష్మీ కాంత్ రెడ్డి చెప్పారు. అంతేకాదు… అన్నీ అనుకున్నట్టు జరిగితే ‘పుష్ప-2’ 80 నుండి 100 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలో ఇంతవరకూ ‘కేజీఎఫ్-2’ సినిమా 350 సింగిల్ థియేటర్లలోనూ 80 మల్టీ ప్లెక్స్ థియేటర్లలోనూ విడుదలైంది. ఇదే ఇప్పటి వరకూ అక్కడ రికార్డ్. అయితే డిసెంబర్ 5న ‘పుష్ప-2’ను మొత్తం 500 థియేటర్లలో విడుదల చేసేందుకున్న ప్లాన్ చేస్తున్నామని లక్ష్మీకాంత్ రెడ్డి చెప్పారు. ఇంకో విశేషం ఏమంటే… ‘కేజీఎఫ్-2’ మూవీ తొలి రోజును 28 నుండి 30 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేసింది. ఆ రికార్డ్ నూ ‘పుష్ప -2’ బ్రేక్ చేస్తుందనేది లక్ష్మీకాంత్ రెడ్డి నమ్మకం. 

ఇది కూడా చదవండి: Prabhas: ఆ స్టార్ కిడ్స్ అందరి ఫేవరేట్ ప్రభాస్!?

Pushpa 2: ర్ణాటకలో ‘పుష్ప-2’ ఇలా సరికొత్త రికార్డులను కొల్లకొట్టబోవడం కొందరికి కంటగింపుగా ఉన్నట్లు అనిపిస్తోంది. ‘పుష్ప-2’ జోరుకు ఎలాగైనా బ్రేక్ వేయాలని తెర వెనుక ప్రయత్నాలు మొదలెట్టినట్టుగా తెలుస్తోంది. కర్ణాటకలోని ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పైనే ‘కేజీఎఫ్, కేజీఎఫ్-2’ సినిమాలు వచ్చాయి. అలానే ఇదే సంస్థ నిర్మించిన ‘బఘీర’ దీపావళి కానుకగా విడుదలైంది. ‘బఘీర’ చిత్రానికి ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ కథను అందించారు. దీనిని తెలుగులో సురేశ్ ప్రొడక్షన్స్, ఏసియన్ పిక్చర్స్ సంయుక్తంగా విడుదల చేశాయి. అయితే కథలో కొత్తదనం లేని కారణంగా ఈ సినిమా బాక్సాఫీస్ బరిలో ఫెయిల్ అయ్యింది. ‘కేజీఎఫ్’ పేట్రన్ లోనే చిత్రీకరణ, పోరాట సన్నివేశాలు ఉండటంతో ప్రేక్షకులు పెదవి విరిచారు. ‘బఘీర’ నిర్మాతలకు ఇది ఊహించని షాక్! దాంతో తమ చిత్రాన్ని తెలుగు వారు ఆదరించలేదు కాబట్టి తాము కూడా తెలుగువారి సినిమాను ఆదరించకూడదనే భావన ఏర్పరచుకున్నారని తెలుస్తోంది.

Pushpa 2: ఇప్పుడు కన్నడిగుల ముందు ఉన్న అతి పెద్ద భారీ చిత్రం ‘పుష్ప-2’నే. సో… దానిని టార్గెట్ చేస్తూ నిర్ణయాలు తీసుకునే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. నిజానికి ఏ సినిమా అయినా… కథలో దమ్ము ఉంటే  ఆడుతుంది. లేకపోతే ఆడదు. ‘బఘీర’ విషయంలోనూ అదే జరిగింది. తెలుగు రాష్ట్రాలలో ‘బఘీర’కు థియేటర్లు ఎక్కువ ఇవ్వలేదనే విమర్శను కన్నడిగులు చేస్తున్నారు. వాస్తవానికి తగినంతమంది ప్రేక్షకులు లేని కారణంగా ఎన్నో చోట్ల ‘బఘీర’ షోస్ ను చివరి నిమిషంలో కాన్సిల్ చేశారు. ఆడలేక మద్దెలు ఒడు అన్న చందాన… తమ చిత్రం బాగోలేక జనం ఆదరించకపోతే.. ఆ అక్కసును ‘పుష్ప-2’ మీద చూడపడం అర్థ రహితం అని అందరూ చెబుతున్నారు. కొందరు ఆవేశపరులైతే… సోషల్ మీడియాలో ‘బాయ్ కాట్ పుష్ప-2’ అంటూ ప్రచారాన్ని కూడా చేస్తున్నారు. కానీ ‘పుష్ప-2’ ఫైర్ ఒక్కసారి బయటకు వచ్చిదంటే దావానలంలా వ్యాపించడం ఖాయం. అప్పుడు దానిని అడ్డుకోవడం ఎవరితరం కాదు. ఒకవేళ కాదు కూడదని ఎవరైన అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే… అందులో పడి మాడిమసై పోవాల్సిందే! ‘డిసెంబర్ 5’ ఎక్కడైనా జరిగేది ఇదే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *