Gup Chup Ganesha

Gup Chup Ganesha: కేఎస్ ఫిలిం వర్క్స్ బ్యానర్ పై “గప్ చుప్ గణేశా” చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్

Gup Chup Ganesha: కేఎస్ ఫిలిం వర్క్స్ బ్యానర్ పై సూరి ఎస్ దర్శకత్వంలో కేఎస్ హేమ్రాజ్ నిర్మాతగా రోహన్, రిదా జంటగా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం “గప్ చుప్ గణేశా”. ఈ చిత్రానికి శ్రీ తరుణ్ సంగీతాన్ని అందించగా అంగత్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. అంతేకాక ఈ చిత్రంలో అంబటి శ్రీనివాస్, గడ్డం నవీన్, అశోక్ వర్ధన్, సోనాలి పాణిగ్రహి, కిషోర్ మారిశెట్టి తదితరులు కీలకపాత్రలో పోషించారు.

ఒక మొహమాటస్తుడైన వ్యక్తి తన మొహమాటం వల్ల ఎటువంటి ఇబ్బందులు పడతాడో హాస్యపరంగా చూపిస్తూ ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకొనుంది. ఈ కథ హాస్యస్పదంగా, ఆకర్షణీయంగా, ఎంతో ఆహ్లాదంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని సన్నివేశాలు యువతను కట్టిపడేస్తాయని ఈ చిత్ర బృందం తెలిపారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. ఈ చిత్రం త్వరలో ఒక ప్రముఖ ఓటిటి ప్లాట్ఫారం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర బృందం తెలిపింది.

నటీనటులు : రోహన్, రిదా, అంబటి శ్రీనివాస్, గడ్డం నవీన్, అశోక్ వర్ధన్, సోనాలి పాణిగ్రహి, కిషోర్ మారిశెట్టి తదితరులు.

సాంకేతిక బృందం :
బ్యానర్ : కేఎస్ ఫిలిం వర్క్స్
నిర్మాత : కేఎస్ హేమ్రాజ్
రచన, దర్శకత్వం : సూరి ఎస్
స్క్రీన్ ప్లే : సూరి ఎస్, రోహన్ రమేష్
సినిమాటోగ్రఫీ : అంగత్ కుమార్
సంగీత దర్శకుడు : శ్రీ తరుణ్
ఎడిటర్ : అరుణ్ ఎం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : మహేష్ మహేంద్ర, భరత్ పచ్చల
పిఆర్ఓ : మధు విఆర్
డిజిటల్ : డిజిటల్ దుకాణం

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించిన ప్రముఖులు.. ఎవరేమన్నారంటే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *