Bunny Vasu: సినీ ఇండస్ట్రీలో మార్పుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నిర్మాత బన్నీ వాస్. ఈ రోజుల్లో సినిమా ఫ్లాప్ అయితే లాభాలు రావని, కేవలం హిట్ అయిన సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద లాభాలు తెచ్చిపెడుతున్నాయని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ బన్నీ వాస్ ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారో తెలుసుకుందాం. నిర్మాత బన్నీ వాస్ సినీ ఇండస్ట్రీ ట్రెండ్స్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఫ్లాప్ సినిమాలు కూడా లాభాలు తెచ్చేవని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని అన్నారు. ప్రేక్షకుల అభిరుచులు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల ప్రభావం వల్ల సినిమా హిట్ అయితేనే ఆర్థిక లాభం సాధ్యమవుతోందని వివరించారు. ఈ మార్పులు నిర్మాతలపై ఒత్తిడిని పెంచుతున్నాయని, కంటెంట్‌లో నాణ్యత కీలకమని ఆయన ఉద్ఘాటించారు.

