Chamala kiran : బీఆర్ఎస్ పార్టీ నేత కేటీఆర్‌పై ఎంపీ చామల కిరణ్ మండిపడ్డారు. కేటీఆర్ రోజూ ప్రెస్‌మీట్‌లు పెట్టడం వల్లే తనకు పూటగడవడం జరుగుతోందని విమర్శించారు. కేవలం మీడియా షోలు కోసం కేటీఆర్ ఈ రకాల ప్రెస్‌మీట్‌లకు దిగుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
బీసీ రిజర్వేషన్లపై సవాల్
చామల కిరణ్ మాట్లాడుతూ, “42 శాతం బీసీ రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇస్తామని కాంగ్రెస్ ఇప్పటికే స్పష్టంగా ప్రకటించింది. అదే విధంగా బీఆర్ఎస్, బీజేపీ కూడా ప్రకటించాలి. కానీ ఆ విషయంలో ఈ రెండు పార్టీలు నోరు విప్పడం లేదు” అని వ్యాఖ్యానించారు.
బీజేపీపై ఆరోపణలు
అలాగే ఆయన బీజేపీపై కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. “మేం కేంద్రమంత్రులను కలిసిన మరుసటి రోజే బీజేపీ నేతలు వెళ్లి తెలంగాణకి ఏం ఇవ్వకండి అంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను అడ్డుకోవడమే బీజేపీ ఉద్దేశ్యం” అని ఆరోపించారు.
చామల కిరణ్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. బీసీ రిజర్వేషన్ల అంశంపై బీఆర్ఎస్, బీజేపీ వైఖరి ఏమిటనే ప్రశ్నలు ఇప్పుడు లేవనెత్తబడ్డాయి.