Mallu ravi: జస్టిస్ సుదర్శన్‌రెడ్డిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసం అని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి తీవ్రంగా విమర్శించారు.
“సల్వాజుడుం పేరుతో ఒకే వర్గం ప్రజలు ఒకరిని ఒకరు చంపుకోవద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి భాగమయ్యారు. ఇది ఆయన వ్యక్తిగత తీర్పు కాదు. సుప్రీంకోర్టు తీర్పే. నక్సలైట్లకు సపోర్ట్ చేశారని చెప్పడం పూర్తిగా అసత్యం, అసందర్భం” అని మల్లు రవి తెలిపారు.
బీజేపీ నేతలు అభద్రతాభావంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.