Tollywood: టాలీవుడ్ నటుడు ధర్మ మహేష్‌పై అతని భార్య గౌతమి తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ సంచలన విషయాలను వెల్లడించారు.
“గర్భవతిగా ఉన్నప్పుడే నన్ను చంపాలని చూశాడు”
గౌతమి మాట్లాడుతూ, “సినిమాల్లో హీరోలా నటిస్తాడు కానీ నిజ జీవితంలో విలన్. నేను గర్భవతిగా ఉన్నప్పుడే నన్ను చంపేందుకు ప్లాన్ చేశాడు. ఇది నా జీవితంలో అత్యంత భయంకర అనుభవం” అని ఆరోపించారు.
పిల్లాడిని అంగీకరించని తండ్రి
ఆమె మరింత షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. “పిల్లాడు పుట్టిన తర్వాత కూడా అతన్ని తన కొడుకుగా అంగీకరించలేదు. కానీ నా సంపాదన, నా హోటల్స్ నుంచి వచ్చే లాభాలు మాత్రం తీసుకుంటున్నాడు” అని మండిపడ్డారు.
రూ.500 కోట్ల కట్నం డిమాండ్
“వాళ్ల నాన్న నాతో రూ.500 కోట్ల కట్నం కావాలని డిమాండ్ చేశారు. ఇంతటి అమానవీయమైన డిమాండ్‌తో మా జీవితాన్ని నరకం చేశారు” అని గౌతమి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
టాలీవుడ్లో కలకలం
ఈ సంచలన ఆరోపణలు వెలుగులోకి రావడంతో సినీ ఇండస్ట్రీలో కలకలం రేగింది. సోషల్ మీడియాలో ఈ అంశం పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ధర్మ మహేష్ ఇంకా ఈ ఆరోపణలపై స్పందించలేదు.
