Vishal-Anjali: తెలుగు వాళ్లైన విశాల్- అంజలి తమిళంలో సెటిలైపోయారు. వీళ్లిద్దరూ, ఖుష్బూ భర్త, సుందర్ సి. డైరెక్షన్లో చేసిన మదగజ రాజా కాస్త లేటుగా, ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు విశాల్ – అంజలి జంటగా మరో మూవీ రాబోతోంది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.
Also Read: Aadhi Pinisetty: కార్తి మార్షల్ లో ఆది పినిశెట్టి!
రవి అరసు దర్శకత్వంలో.. విశాల్ 35వ సినిమాని ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి నిర్మిస్తున్నారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ కిది 99వ సినిమా కావడం విశేషం. దుషారా విజయన్ హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా మరో ఇంపార్టెంట్ రోల్ కోసం అంజలిని కూడా ఫిక్స్ చేశారు. ఆగస్టు 1న రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం ఊటీలో సెకండ్ షెడ్యూల్ జరుగుతోంది. 45 రోజుల్లో షూట్ కంప్లీట్ చెయ్యాలనేది టీమ్ టార్గెట్. జి.వి.ప్రకాష్ ఈ మూవీకి మ్యూజిక్ ఇస్తున్నారు.