Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు 22వ తేదీన ఢిల్లీలో పర్యటించనున్నారు. అదే రోజు ఎకనమిక్ టైమ్స్ మీడియా సంస్థ నిర్వహించే కాన్‌క్లేవ్‌లో చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. అదే రోజు పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలువనున్నారు. ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలువనున్నారు.
Chandrababu Naidu: ఆగస్టు 21న సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. సీఆర్డీఏ ప్రతిపాదనలకు క్యాబినెట్‌లో ఆమోదం తెలుపనున్నారు. ఇదే క్యాబినెట్ భేటీలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులు ప్రకటించే అవకాశం ఉన్నది. అదే విధంగా జిల్లాల పునర్విభజన, పేర్ల మార్పులపై చర్చ జరుగుతుందని అందరూ భావిస్తున్నారు.

