Pawan Kalyan

Pawan Kalyan: శ్రీశైలం ఎమ్మెల్యేపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం!

Pawan Kalyan: శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అటవీ సిబ్బందితో ఘర్షణ పడిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రజా జీవితంలో ఉన్నవారు ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

ఘటనపై పవన్ కల్యాణ్ ప్రకటన
బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. “అటవీశాఖ ఉద్యోగులపై దాడి జరిగినట్లు తెలిసింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే ప్రమేయంపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించాను. బాధ్యులపై వెంటనే కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయాలని చెప్పాను.” అని పేర్కొన్నారు. అంతేకాకుండా, ప్రజా ప్రతినిధులు తమను తాము నియంత్రించుకోవాలని, ఉద్యోగుల విధి నిర్వహణకు అడ్డుపడే వారిని ఏ స్థాయిలో ఉన్నా కూటమి ప్రభుత్వం సహించదని ఆయన స్పష్టం చేశారు.

సీఎం చంద్రబాబు సైతం సీరియస్
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడి ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఎమ్మెల్యే తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. తప్పు ఎవరిదైనా సరే, కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *