Woman Traffic Cop

Woman Traffic Cop: ఘోరం.. మహిళా పోలీస్‌ను 120 మీటర్లు ఈడ్చుకెళ్లిన ఆటో డ్రైవర్‌

Woman Traffic Cop: మహారాష్ట్రలోని సతారా జిల్లాలో మద్యం మత్తులో ఓ ఆటో డ్రైవర్ చేసిన సంచలనాత్మక ఘటన కలకలం రేపుతోంది. డ్యూటీలో ఉన్న మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను అతడు ఆటోతో ఢీకొట్టి దాదాపు 120 మీటర్ల మేర రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సోమవారం సతారా నగరంలోని ఖండోబా మాల్ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో మహిళా కానిస్టేబుల్ భాగ్యశ్రీ జాదవ్ (Bhagyashree Jadhav) చెకింగ్ కోసం ఆటోను ఆపమని సంకేతం ఇచ్చారు. అయితే మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ దేవరాజ్ కాలే (Devraj Kale) ఆగకుండా వేగంగా ముందుకు పోనిచ్చాడు. కానిస్టేబుల్‌ను లెక్కచేయకుండా ఢీకొట్టి ఆటోకు వేలాడుతూ వెళ్లేలా చేశాడు.

ఇది కూడా చదవండి: Delhi: ఇండియా కూటమి అభ్యర్థి తెలంగాణ వాసి

దాదాపు 120 మీటర్ల దూరం వరకు రోడ్డుపై ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. పరిస్థితిని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఆటోను ఆపేశారు. అనంతరం డ్రైవర్‌ను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు.

ప్రస్తుతం గాయపడిన మహిళా పోలీసు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు.

ఈ సంఘటన ట్రాఫిక్ పోలీసుల భద్రతపై ఆందోళనలు రేకెత్తించింది. మద్యం మత్తులో వాహనం నడిపే నిర్లక్ష్య డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌ సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Prabhas-Rajinikanth: అక్కడ రికార్డుల రాజులు.. ప్రభాస్-రజినీ మాత్రమే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *