దివంగత సినీ నటుడు కోట శ్రీనివాసరావు ఇంట మరో విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి రుక్మిణి కన్ను్మూశారు. కోట శ్రీనివాసరావు 2025 జులై 13న తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన ఇకలేరన్న వార్త మరువక ముందే కోట సతీమణి మృతి చెందడం ఆయన కుటుంబ సభ్యులతో పాటు, అందరినీ కలచివేస్తోంది. ఈ క్లిష్ట సమయంలో శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. కోట శ్రీనివాసరావు, రుక్మిణికి1966లో వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు సంతానం, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. కోట ప్రసాద్, సినీ రంగంలో నటుడిగా తన తండ్రి అడుగుజాడల్లో నడిచారు. దురదృష్టవశాత్తు, 2010లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు.ఇద్దరు కుమార్తెలకు వివాహాలై పిల్లలు కూడా ఉన్నారు. కోట నట జీవితంలో పడి కుటుంబాన్ని సరిగా పట్టించుకోలేకపోయానని పలుమార్లు పంచుకున్నారు. తన భార్య, కుటుంబ సభ్యులే పిల్లల్ని మంచి బుద్ధిమంతులవడానికి కారణమని తెలిపారు. కోట శ్రీనివాసరావుకు ఓర్పు ఎక్కువని, అందరితోనూ సరదాగా ఉంటారని రుక్మిణి ఓ సందర్భంలో వెల్లడించారు. కోట నటించిన చిత్రాల్లో ‘అహనా పెళ్లంట’ అంటే తనకెంతో ఇష్టమని రుక్మిణి గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

