Crime News: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ 12 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
కూకట్‌పల్లిలోని సంగీత్ నగర్‌లో నివాసముంటున్న ఓ కుటుంబంలో, తల్లిదండ్రులు రోజూవారీ కూలి పనులకు వెళ్లేవారు. ఈ క్రమంలో, మధ్యాహ్నం భోజనం కోసం తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పటికే ఇంట్లో ఒంటరిగా ఉన్న అతని 12 ఏళ్ల కూతురు రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంది. ఈ దృశ్యం చూసి తండ్రి గుండె పగిలిపోయింది. వెంటనే అరుపులు, కేకలతో చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేశాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, పరిస్థితిని సమీక్షించారు. బాలికను ఎవరు, ఎందుకు హత్య చేశారనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించేందుకు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌లను రంగంలోకి దించారు. ఈ దారుణానికి పాల్పడిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.