Rahul Gandhi: బీహార్ ఎన్నికల సమీపిస్తున్నా కొద్దీ.. పోటాపోటీ రాజకీయ వ్యూహ, ప్రతి వ్యూహాలతో ఇరు కూటములు రక్తి కట్టిస్తున్నాయి. కేంద్ర రాజకీయాలన్నీ బీహార్ ఎన్నికలతోనే ముడిపడి ఉంటున్నాయి. ఎన్డీయే కూటమి, ఇండియా కూటమి ఏ కార్యక్రమం చేపట్టినా, బీహార్ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే ప్రతి అడుగు వేస్తున్నాయి.
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ బీహార్ ఎన్నికలపై అడుగులు వేగంగా వేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల కమిషన్‌పై పోరాటాన్ని తీవ్రతరం చేశారు. లక్షలాది ఓట్లు గల్లంతయ్యాయని సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా ఓట్ బందీగా అభివర్ణిస్తూ ఏకంగా ఆందోళనబాటే పట్టారు. ఎన్నికల సంఘం తీరుకు నిరసనగా ఆయన ఆగస్టు 17 నుంచి ఓట్ అధికార్ యాత్రను ప్రారంభించనున్నారు.
Rahul Gandhi: ఆగస్టు 17 నుంచి 16 రోజుల పాటు ఈ ఓటర్ అధికార యాత్ర కొనసాగుతుంది. 23 జిల్లాల మీదుగా 1300 కిలోమీటర్ల వరకు కొనసాగుతుంది. ససారామ్‌లో ఈ యాత్రను ప్రారంభించారు. ఈ యాత్రకు మహాగఠ్‌బంధన్ కూటమి పక్షాలు కూడా పూర్తిగా మద్దతు ప్రకటించాయి. ఇప్పటికే ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ కూడా కాంగ్రెస్‌తో కలిసి ప్రజలను సమీకరిస్తామని ప్రకటించారు.
Rahul Gandhi: రాజ్యాంగ పరిరక్షణ కోసం బీహార్‌లో మాతో కలవండి.. అని రాహుల్‌గాంధీ ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు. ప్రతి వ్యక్తికి ఓటు అనేది ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కు.. దానిని కాపాడేందుకే ఈ పోరాటం అని పేర్కొన్నారు. ఇదే పోరాటానికి తేజస్వీ యాదవ్ ఒక ప్రచార గీతాన్ని కూడా రూపొందించారు. బీహార్ ఓటరు జాబితా నుంచి ఏ ఒక్క ఓటరు పేరు కూడా పోవొద్దు. ఈ విషయంపై ప్రజల్లో చైతన్యం తేవడమే లక్ష్యం అని పేర్కొన్నారు.

