Cm revanth: దేశానికి నాయకత్వం వహించాలనే దురాశతో ఉన్నదాన్ని పోగొట్టుకున్నారని, తెలంగాణ పేరు, పేగు బంధం కూడా తెంచుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. “నేను ఎవరినీ శత్రువుగా చూడను. నేను ఎవరినైనా శత్రువుగా చూడాలని అనుకున్నా, వాళ్లకు ఆ స్థాయి ఉండాలి” అని వ్యాఖ్యానించారు.
జెడ్పీటీసీ సభ్యుడిగా ప్రారంభించిన తన రాజకీయ ప్రయాణం ఇంత పెద్ద స్థాయికి రావడం ప్రజల ఆశీస్సుల వల్లేనని గుర్తుచేశారు. “ఈ గొప్ప అవకాశం నాకు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఇచ్చారు. వారి నమ్మకమే నా శక్తి” అని సీఎం స్పష్టం చేశారు.

