Donald Trump: ఉక్రెయిన్ యుద్ధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కీలక చర్చలు జరిపిన అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని కొంత మారింది అని అర్ధం అవుతుంది. రష్యా మరియు దాని వాణిజ్య భాగస్వాములపై ద్వితీయ ఆంక్షలు వెంటనే విధించాల్సిన అవసరం లేదని, అయితే రెండు నుంచి మూడు వారాల్లో మళ్లీ ఆ అంశాన్ని పునఃపరిశీలించాల్సి రావచ్చని ఆయన స్పష్టం చేశారు.
అలాస్కా సమావేశానికి 10/10 రేటింగ్
అలాస్కాలో పుతిన్‌తో జరిగిన శిఖరాగ్ర సమావేశం గురించి మాట్లాడుతూ, సమావేశం చాలా బాగా జరిగింది. దానికి నేను 10/10 రేటింగ్ ఇస్తాను అని ట్రంప్ ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. అయితే నేను ఇప్పుడు ద్వితీయ ఆంక్షలు విధిస్తే అది వారికి వినాశకరంగా మారుతుంది అని భవిష్యత్తు చర్యలపై సంకేతాలు ఇచ్చారు.
భారతదేశంపై ప్రభావం
రష్యా చమురు కొనుగోలు కొనసాగిస్తున్నందుకు భారత్ ఇప్పటికే అమెరికా నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ట్రంప్ ప్రభుత్వం ఇటీవల భారత వస్తువులపై అదనంగా 25% సుంకం విధించింది. దీంతో మొత్తం సుంకం 50%కి పెరిగింది. రష్యా చమురు కొనుగోలు చేసే ప్రధాన దేశాలు చైనా, భారత్ అని ట్రంప్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Vastu Tips: చేతిలో డబ్బు నిలవడం లేదా.. రూపాయి నాణెంతో ఇలా చేయండి..!
అయితే, అమెరికా హెచ్చరికల మధ్య భారత్ తన వైఖరిని స్పష్టంగా తెలియజేసింది. రష్యా చమురు దిగుమతులు ఆగవని, దేశ ఆర్థిక ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం కొనసాగుతుందని న్యూఢిల్లీ చెప్పింది.
శాంతి ఒప్పందం పైనే దృష్టి
ఉక్రెయిన్ యుద్ధం నాలుగో ఏడాదిలోకి ప్రవేశిస్తుండగా, పుతిన్ శాంతి ఒప్పందానికి అంగీకరించకపోతే తీవ్రమైన పరిణామాలు తప్పవని ట్రంప్ హెచ్చరించారు. యూరోపియన్ ప్రమేయంతో కూడిన శాంతి ఒప్పందం ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోడిమిర్ జెలెన్స్కీపై ఆధారపడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఒక ఒప్పందం చేసుకోండి అని జెలెన్స్కీని కోరారు.
యుద్ధ ఖైదీల బదిలీ సూచన
ఇకపోతే, యుద్ధ ఖైదీల బదిలీ జరగే అవకాశం ఉందని ట్రంప్ వెల్లడించారు. “నా దగ్గర వేలాది మంది ఖైదీల జాబితా ఉంది. వారు త్వరలో విడుదల అవుతారు” అని ట్రంప్ తెలిపారు.
Trump on secondary tariffs: “Because of what happened today, I think I don’t have to think about it. I may have to think about it in two weeks or three weeks or something, but we don’t have to think about that right now. I think the meeting went very well.” pic.twitter.com/OAZgaotTY7
— The Bulwark (@BulwarkOnline) August 16, 2025
