Bullet Train

Bullet Train: కూలిన బుల్లెట్ రైలు కోసం నిర్మిస్తున్న బ్రిడ్జి.. ఇద్దరి మృతి!

Bullet Train: గుజరాత్‌లోని ఆనంద్‌లో బుల్లెట్ రైలు కోసం నిర్మిస్తున్న ట్రాక్ నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. వంతెన శిథిలాల కింద చాలా మంది చిక్కుకుపోయినట్టు భావిస్తున్నారు. .

వాసద్ సమీపంలో బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ జరుగుతోందని, అందులో ఇనుప మెష్ పడిపోవడం వల్ల ముగ్గురు నుండి నలుగురు కూలీలు సమాధి అయ్యారని సమాచారం అందిందని ఆనంద్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జాసాని చెప్పారు. ఇద్దరు కూలీలు మృతి చెందగా, ఒక కార్మికుదీని రక్షించారు.  ఇంకా ఒక కార్మికుడు చిక్కుకుని ఉన్నట్లు భావిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది.

Bullet Train: ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్ కోసం గుజరాత్‌లోని మొత్తం 20 నదీ వంతెనలలో 12 నిర్మాణం పూర్తయింది. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) గుజరాత్‌లోని నవ్‌సారి జిల్లాలో ఖరేరా నదిపై 120 మీటర్ల పొడవైన వంతెనను ఇటీవలే పూర్తి చేసినట్లు తెలిపింది. దీంతో 12 వంతెనల నిర్మాణం పూర్తయింది. మరో 8 బ్రిడ్జిలు నిర్మాణంలో ఉన్నాయి. 

ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్ పొడవు 508 కిలోమీటర్లు . ఈ ప్రాజెక్టులో గుజరాత్‌లోని 352 కి.మీ, మహారాష్ట్రకు చెందిన 156 కి.మీ. ముంబై, థానే, విరార్, బోయిసర్, వాపి, బిలిమోరా, అహ్మదాబాద్, సూరత్, భరూచ్, వడోదర, ఆనంద్, నదియాడ్, సబర్మతి వంటి మొత్తం 12 స్టేషన్లను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Pawan Kalyan: నా జీవితంలో పుస్తకాలు లేకపోయుంటే నేను ఏమయ్యేవాడినో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *