Bitter Gourd:కాకరకాయ చేదు అని మనలో చాలా మంది ఇష్టపడరు. పిల్లలైతే దూరంగా ఉంటారు. అమ్మో మా పిల్లలు చేదు కాకర తినలేరు.. అంటూ కాకరను దూరమే పెడతారు. కానీ కాకరకాయ కూరతో ఉన్న ప్రయోజనాలు మనకు తెలిస్తే దానిని వదలబోరు. నేటి సమాజంలో ప్రతి మనిషిని ఇబ్బంది పెట్టే శారీరక ఇబ్బందులకు ఇట్టే కాకరకాయ ఫుల్‌స్టాప్ పెడుతుందని తెలుసుకుంటే దానిని కోరి మరీ వండుకొని తింటారు.
Bitter Gourd:ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కాకరకాయ కూర ఎంతో సహాయ పడుతుంది. కాకరకాయలో మధుమేహాన్ని నియంత్రించే లక్షణాలు ఉన్నాయి. మధుమేహం ఉన్నవారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని మరింతగా పెంచుతుంది. బరువు తగ్గడానికి ఈ కాకరకాయ కూర ఎంతగానో దోహదపడుతుంది.
Bitter Gourd:కాకరకాయలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయ పడతాయి. తద్వారా ఇన్ఫెక్షన్లు, వ్యాధులతో పోరాడేందుకు శరీరాన్ని బలోపేతం చేస్తాయి. కాకరకాయ తక్కువ కేలరీలు కలిగి ఉండి, అధిక మొత్తంలో ఫైబర్ కలిగి ఉంటుంది. ఇది ఎక్కువ సేపు కండుపు నిండుగా ఉంచడంలో సహాయపడుతుంది. తద్వారా ఇది బరువు తగ్గడానికి దారితీస్తుంది.
Bitter Gourd:కాకరకాయలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పర్చడంలో సాయం చేస్తాయి. చర్మ సమస్యల నివారణలోనూ ఇది పనిచేస్తుంది. మొటిమలనూ నివారిస్తుంది. జీర్ణక్రియను మెరుగు పర్చడంలో సహాయ పడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. జీర్ణ సమస్యలను రాకుండా చేస్తుంది.
Bitter Gourd:మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే కాకరకాయలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయని కొన్ని అధ్యయనాలు తేల్చాయి. కాకరకాయ చేదుగా ఉన్నప్పటికీ ఇది శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అందుకే కాకర కాయను మీ ఆరోగ్యంలో భాగం చేసుకోవడానికి ప్రయత్నించండి. కరివేపాకులా తీసి పారేయకండి.

