Faria Abdullah: జాతిరత్నాల సుందరి ఫరియా అబ్దుల్లా ఒక్క హిట్‌తో యూత్‌ను ఫిదా చేసింది. మత్తు వదలరా 2తో బ్లాక్‌బస్టర్ అందుకున్న ఈ చిట్టి, అందరి దృష్టినీ ఆకర్షించింది. కానీ, ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఆమెకు ఊహించిన విజయాలు ఇవ్వలేదు. అక్కినేని హీరోల సినిమాల్లో చిన్న పాత్రలు, కోలీవుడ్‌లో ఆలస్యమయ్యే ప్రాజెక్టులు, టాలీవుడ్‌లో కొత్త అవకాశాల కొరత… ఫరియా కెరీర్ ఎందుకు సైలెంట్‌గా మారింది? ఆమె తదుపరి అడుగు ఏమిటి?
Also Read: Bipasha Basu: మృణాల్ ఠాకూర్ పాత కామెంట్స్ రచ్చ.. బిపాషా స్ట్రాంగ్ రిప్లై!
ఫరియా అబ్దుల్లా జాతిరత్నాలతో టాలీవుడ్‌లో సంచలన ఎంట్రీ ఇచ్చింది. కానీ, రావణాసుర, లైక్ షేర్ సబ్‌స్క్రైబ్, ఆ ఒక్కటీ అడక్కు ఫ్లాప్‌లతో వెనక్కి నెట్టబడింది. కల్కి 2898 ఏడీలో గెస్ట్ రోల్ ఆమెకు పెద్ద గుర్తింపు తేలేదు. తమిళంలో విజయ్ ఆంటోనీతో వల్లిమయిల్ షూటింగ్ పూర్తయినా రిలీజ్ ఆలస్యం అవుతుంది. తెలుగులో భగవంతుడు, నరేష్ అగస్త్యతో గుర్రం పాపిరెడ్డి ప్రాజెక్టులు ఉన్నాయి కానీ, రిలీజ్ డేట్స్ లేవు. సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్‌తో ఫ్యాన్స్‌ను అలరిస్తున్న ఫరియా, బిగ్ హీరోలతో అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.