Road Accident: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది. ముందు వెళ్తున్న లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో బస్సులో వెళ్తున్న ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. పలువురికి గాయాలయ్యాయి. ఆగస్టు 15న 44వ జాతీయ రహదారిపై ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Road Accident: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప నగరం నుంచి సీజీఆర్ ట్రావెల్స్ బస్సు 35 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు వస్తున్నది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల వద్దకు రాగానే 44వ జాతీయ రహదారిపై ముందుగా వెళ్తున్న లారీని బస్సు ఢీకొన్నది. ఈ ప్రమాదంలో బస్సు ముందుభాగం నుజ్జు నుజ్జు అయింది. ఈ ఘటనలో ఆ బస్సు డ్రైవర్ సహా ఇద్దరు మహిళా ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు.
Road Accident: ప్రమాదంలో మృతి చెందిన ఆ మహిళలు ఇద్దరిదీ హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి ప్రాంతం. కడపలో బంధువుల ఇంటిలో జరిగిన వివాహానికి వెళ్లి వస్తుండగా జరిగిన ప్రమాదంలో వారు మరణించారని తెలుస్తున్నది. ఆ బస్సు డ్రైవర్ నిద్ర మత్తులో నిద్ర మత్తులో ఉండటమే ప్రధాన కారణమని తెలుస్తున్నది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

