Alludu Adi Narayana Adurs: అల్లుడు ఆదినారాయణ రెడ్డి అదుర్స్ అంటున్నారు పులివెందుల ప్రజలు. జెడ్పీటీసీ ఎన్నికల్లో జగన్, అవినాశ్‌లే టార్గెట్‌గా ఆయన రాజకీయం చేశారు. అక్కడున్న జగన్ ప్రత్యర్థి బీటెక్ రవి కన్నా దూకుడు ప్రదర్శించారు. ముఖ్యంగా పులివెందులపై ఆదినారాయణ రెడ్డికి ఆణువణువూ పట్టుంది. ఆది సొంత నియోజకవర్గం జమ్మలమడుగు అయినా.. ఆయనకి పులివెందులలో మాస్ ఫాలోయింగ్ ఉంది. అందుకే ఇప్పుడు… జమ్మలమడుగు తరహా రాజకీయం పులివెందులలో జరిగిందా? ఆది బ్రాండ్ పులివెందులకూ చేరిందా? ఆది గెలుపు సూత్రం పులివెందులలో సక్సెస్ అయ్యిందా? అంటూ రాజకీయ విశ్లేషకులు పరిశీలనలో పడ్డారు. మొత్తానికి కడప జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టిని తన వైపే తిప్పుకున్నారు ఆదినారాయణ రెడ్డి.
Also Read: PM Modi: ఎర్రకోట వద్ద జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధాని
ఎమ్మెల్యే ఆది మార్క్ రాజకీయాలు పులివెందుల తలుపు కొట్టడంతో ఫ్యాన్ రెక్కలు తునా తునకలయ్యాయి. పులివెందులలో 30 ఏళ్ల చరిత్రను తిరగ రాశాయి ఆది వ్యూహాలు. జమ్మలమడుగు ఎమ్మెల్యే అయిన ఆది… పులివెందులలో తిష్ట వేసినప్పుడే ఫలితం అక్కడి స్థానిక వైసీపీ నేతలకు అర్థమైందట. జగన్, అవినాశ్‌ల పతనానికి ఆది ఎంట్రీ నాంది అంటూ గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారట. ఆది ఎంట్రీపై అంత చర్చ ఎందుకంటారా? జమ్మలమడుగు అంటే ఆది.. ఆది అంటే జమ్మలమడుగు. ఇదే అందరికీ తెలుసు. కానీ ఆదినారాయణ రెడ్డి పులివెందుల అల్లుడు అన్న మాట కొంత మందికే తెలుసు. జమ్మలమడుగుపై ఆదికి ఎంత పట్టు ఉందో… పులివెందులలోనూ ఆ స్థాయిలోనే ఉంది. పులివెందులలో ఆది బంధుత్వం కూడా ఈ ఎన్నికల్లో ప్రధాన భూమిక పోషించింది. ఏది ఏమైనా పులివెందులలో అల్లుడు అదుర్స్ అనిపించుకున్నాడు ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి.

