Vijayawada: కృష్ణానదిలో వరద ఉధృతి కొనసాగుతుండటంతో పరీవాహక ప్రాంతాలలో హైఅలర్ట్ ప్రకటించారు. మత్స్యకారులు నదిలోకి వెళ్లొద్దని అధికారులు కఠిన ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఇదిలా ఉండగా, మత్స్యకారులు తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మెరక ప్రాంతాలలో ఇళ్ల స్థలాలను కేటాయించాలని వారు కోరుతున్నారు.

