Pooja Hegde: సౌత్ సినిమాల్లో హీరోయిన్ పూజా హెగ్డే సత్తా చాటుతోంది. బాలీవుడ్‌లో మాత్రం తనకు సరైన పాత్రలు రాలేదని సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ భామ. సౌత్‌లో ఆమె చేసిన క్యారెక్టర్లు మర్చిపోలేనివని, బాలీవుడ్‌లో మాత్రం గ్లామర్ రోల్స్‌తో సరిపెట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పూజా మాటల్లో ఎంత నిజం ఉంది? ఆమె బాలీవుడ్‌పై ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేసింది?
Also Read: War 2 Twitter Review: ‘వార్ 2’ ట్విట్టర్ రివ్యూ: ఎన్టీఆర్-హృతిక్ యాక్షన్ ధమాకా!
వాయిస్ ఓవర్: పూజా హెగ్డే తాజా వ్యాఖ్యలు బాలీవుడ్‌లో కలకలం రేపుతున్నాయి. సౌత్ సినిమాల్లో తనకు బలమైన, వైవిధ్యమైన పాత్రలు దక్కాయని, ముఖ్యంగా ‘రెట్రో’లో రుక్మిణీ పాత్ర తన నటనా సత్తాను చాటిందని చెప్పింది. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఆ పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారని కొనియాడింది. బాలీవుడ్‌లో మాత్రం తనను గ్లామర్ హీరోయిన్‌గా స్టీరియోటైప్ చేశారని, గుర్తుండిపోయే పాత్రలు ఇవ్వలేదని ఆరోపించింది. సౌత్‌లో సూర్య, విజయ్ వంటి స్టార్స్‌తో నటించిన పూజా, బాలీవుడ్‌లో ‘మోహన్‌జోదారో’, ‘సర్కస్’ వంటి సినిమాల్లో నటించినా అవి ఆశించిన విజయం సాధించలేదు. తన కెరీర్‌లో మరిన్ని సవాల్‌తో కూడిన పాత్రలు చేయాలని ఆకాంక్షిస్తోంది.

