Actress Sadha

Actress Sadha: వాటిని చంపేస్తారు.. సుప్రీం తీర్పు వెనక్కి తీసుకోవాలి.. ఏడ్చేసిన హీరోయిన్ సదా

Actress Sadha: ఒకప్పుడు ‘జయం’, ‘నాగ’, ‘అపరిచితుడు’ వంటి హిట్‌ సినిమాల్లో నటించి టాప్‌ హీరోయిన్‌గా వెలిగిన సదా, ఇప్పుడు వెండితెరపై అంతగా కనిపించడం లేదు. కానీ, ఆమెకు జంతుప్రేమ ఎక్కువగా ఉండటంతో, తన ఇష్టానుసారం వైల్డ్‌ లైఫ్ ఫోటోగ్రఫీని ప్రొఫెషన్‌గా ఎంచుకుని హ్యాపీ లైఫ్ గడుపుతున్నారు. సోషల్ మీడియాలో ఆమె తీసిన వన్యప్రాణుల ఫోటోలు, వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి.

అయితే తాజాగా, సదా కన్నీళ్లు పెట్టే వీడియోను షేర్ చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన కొత్త తీర్పు. దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న అన్ని వీధి కుక్కలను ఎనిమిది వారాల్లో షెల్టర్లకు తరలించాలని కోర్టు ఆదేశించింది. ఎవరైనా ఈ ప్రక్రియను అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది.

సదా ఆవేదన

సదా మాట్లాడుతూ.. “ఒక్క రేబిస్‌ కేసు కోసం మూడు లక్షల కుక్కలను ఇలా తరలిస్తారా? లేక చంపేస్తారా? ఎనిమిది వారాల్లో వాటికి షెల్టర్లు ఎలా సిద్ధం చేస్తారు? ఇది అసాధ్యం. చివరికి వాటిని చంపేస్తారు. ప్రభుత్వం ఇప్పటివరకు వాటికి వ్యాక్సిన్‌ వేసిందా? ఏబీసీ (Animal Birth Control) ప్రోగ్రామ్‌ కోసం ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు. మేము జంతు ప్రేమికులు, ఎన్జీవోలు మా జేబులోంచి డబ్బు ఖర్చు చేసి వాటికి చికిత్స చేస్తున్నాం. కానీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదు. ఈ తీర్పు నన్ను లోపలే చంపేస్తోంది. వాటిని చంపడం సరికాదు. దయచేసి ఈ తీర్పు వెనక్కు తీసుకోండి” అని కన్నీలు పెట్టుకున్నారు. 

ఇది కూడా చదవండి: Shamshabad: శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి పలు విమానాల దారి మళ్లింపు

సమస్య తీవ్రత

దేశంలో వీధి కుక్కల బెడద పెరుగుతోంది. ప్రతి 11 సెకన్లకో కుక్కకాటు కేసు నమోదవుతోంది. 2024లోనే 37 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. పసికందులు, వృద్ధులపై కూడా దాడులు జరుగుతున్నాయి. కుక్కకాట్ల వల్ల రేబిస్‌ సోకి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

సినీ తారల మద్దతు

సదా మాత్రమే కాదు, జాన్వీ కపూర్‌, చిన్మయి శ్రీపాద, వరుణ్ ధావన్, సోనాక్షి సిన్హా, భూమి పెడ్నేకర్‌ తదితరులు కూడా ఈ తీర్పును వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో స్పందించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *