Shamshabad: హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలు, కమ్ముకున్న మేఘాల కారణంగా శంషాబాద్ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రతికూల వాతావరణం దృష్ట్యా అధికారులు పలు విమానాలను ఇతర నగరాలకు దారి మళ్లించారు.
విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం తొమ్మిది విమానాలను దారి మళ్లించారు. వీటిలో విజయవాడకు ఐదు, బెంగళూరుకు మూడు, తిరుపతికి ఒక విమానాన్ని మళ్లించారు. అదేవిధంగా, హైదరాబాద్ నుంచి బయలుదేరాల్సిన కొన్ని విమానాలను తాత్కాలికంగా రద్దు చేశారు.
ఇది కూడా చదవండి: AR Rahman: రెహమాన్ మాస్ మ్యాజిక్.. పెద్దిలో శ్రీకాకుళం బీట్!
నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కొనసాగుతుండటంతో విమానాల రాకపోకలు ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు సూచించారు. ప్రయాణికులు తాజా సమాచారం కోసం విమానయాన సంస్థలను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

