Supreme Court: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గవర్నర్ కోటా కింద ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్‌ను ఎమ్మెల్సీలుగా నియమించారు. అయితే, ఈ నియామకాలను సవాలు చేస్తూ బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు
2024 ఆగస్టు 14న సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్, కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా స్టేటస్ కో విధించాలని కోరగా, “గవర్నర్ నామినేట్ చేయడాన్ని అడ్డుకోలేము” అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎమ్మెల్సీల నియామకం ప్రభుత్వ విధి అని కూడా కోర్టు పేర్కొంది.
కోదండరాం, అలీఖాన్ నియామకం రద్దు
బీఆర్‌ఎస్ నేతల పిటిషన్‌లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమితులైన కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకాలను రద్దు చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ప్రభుత్వం లేదా గవర్నర్ తీసుకునే చర్యలు సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది.
సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
కోదండ రామ్, అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీల నియామకం రద్దు..
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండ రామ్, అలీఖాన్..
తాజా నామినేషన్లు తమ తుది తీర్పుకు లోబడే ఉంటాయన్న సుప్రీంకోర్టు..
దాసోజు శ్రవణ్, సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను… pic.twitter.com/YnBT9JQg8u
— s5news (@s5newsoffical) August 13, 2025

