Uttam Kumar: నీటిపారుదలశాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నీటిపారుదలశాఖలో పూర్తిస్థాయిలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగంలోకి తీసుకువచ్చి ప్రాజెక్టుల నాణ్యత, వేగం రెండింటినీ మెరుగుపరచాలని సూచించారు.
ప్రాజెక్టుల డిజైన్లు నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తిచేయాలని ఆదేశించిన మంత్రి, డిజైన్ విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి పదోన్నతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటామని, ముఖ్యంగా ఇంజినీరింగ్ నిపుణులను నియమించుకోవడం ద్వారా ప్రాజెక్టుల పనితీరును మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.