Rythu Bima:మీరు రైతులా? రైతు బీమాకు దరఖాస్తు చేసుకున్నారా? అర్హతలు మీకు తెలుసా? గడువు ఎంతవరకు ఉన్నదో మీకు తెలుసా? జూన్ 5 లోపుమీకు పట్టాదారు పాస్ పుస్తకం మంజూరైందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇది చదవాలి. ఇప్పటికే రైతుబీమాలో నమోదై ఉండి ఉంటే అవసరం లేదు. రెన్యువల్ చేసుకోవాల్సిన రైతుల వివరాలు మీ మండలంలో ఏఈవో వద్ద ఉంటాయి. వారైతే కచ్చితంగా దరఖాస్తు చేసుకోవాలి. కొత్తగా భూముల రిజస్ట్రేషన్ చేసుకున్న వారు అర్హులైతే తప్పక దరఖాస్తు చేసుకోవాలి.
Rythu Bima:18 ఏళ్ల నుంచి 59 సంవత్సరాల వయసు వరకు ఉన్న ప్రతీ రైతు ఈ రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం కీలక అప్‌డేట్ ఇచ్చింది. సంబంధిత రైతు పేరిట భూమి పట్టాదారు పాస్ పుస్తకం ఉండాలి. దానితోపాటు ఆధార్ కార్డును ఏఈవోల వద్ద దరఖాస్తు చేయాలి. నామినీ పేరిట ఉన్న ఆధార్ కార్డును కూడా జతచేయాల్సి ఉంటుంది. ఆగస్టు 13వ తేదీలోగా రైతులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.
Rythu Bima:జూన్ 5 వరకు పట్టాదారు పాస్ పుస్తకం జారీ అయినప్పటికీ ఇంతవరకు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోని వారికి ప్రభుత్వం ఈ అవకాశం ఇచ్చింది. రైతులు 1966 ఆగస్టు 14 నుంచి 2007 ఆగస్టు 14 మధ్యలో పుట్టిన వారై ఉండాలని తెలిపింది. రైతుబీమా దరఖాస్తు ఫారం, ఆ రైతు పట్టాదారు పాస్ పుస్తకం (తహసీల్దార్ డిజిటల్ సంతకంతో కూడినది), రైతు ఆధార్‌కార్డు, నామినీ ఆధార్ కార్డుతో దరఖాస్తు సమర్పించాలి.
Rythu Bima:2018 ఆగస్టు 14న ప్రారంభమైన ఈ రైతుబీమా పథకం రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నది. సభ్యత్వం ఉండి రైతు మరణిస్తే, ఆ రైతు కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం కింద అందజేస్తారు. సహజ మరణమైనా, ప్రమాదకరంగా మరణించినా పరిహారం అందుతుంది. ఈ పరిహారం మొత్తాన్ని నామినీ బ్యాంకు ఖాతాలో జమచేస్తారు.