Tesla: అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ అయిన టెస్లా.. భారతదేశంలో మరో నగరానికి తన కార్యకలాపాలను విస్తరించింది. ఇప్పటికే ముంబై నగరంలో తన తొలి షోరూంను ప్రారంభించిన టెస్లా సంస్థ.. అతి కొద్దిలకాలంలో దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో మరో షోరూంను కొత్తగా లాంఛ్ చేసింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశంలో టెస్లా కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు ఆ సంస్థ వేగంగా అడుగులు వేస్తున్నది.
Tesla: ఢిల్లీ నగరంలోని టెస్లా తన షోరూం కోసం వాణిజ్య స్థలాన్ని అద్దెకు తీసుకున్నది. దీనికోసం కళ్లుచెదిరేలా మూడు కాంప్లెక్స్‌లలో షోరూంను ప్రారంభించింది. ఇది కేవలం విక్రయ కేంద్రం కాకుండా, ఎక్స్ పీరియన్స్ సెంటర్‌గా ఉండి, కస్టమర్ల కార్లను సమీపం నుంచి పరిశీలించి, కొనుగోలు ప్రక్రియ, చార్జింగ్ ఆప్షన్లపై వివరాలు తెలుసుకునేలా సహకరిస్తుంది.
Tesla: ఢిల్లీ షోరూం నుంచి ఢిల్లీ, గురుగ్రాం, నోయిడా ప్రాంతల వారికి టెస్లా సేవలు అందించనున్నది. 9 ఏళ్ల కాలానికి షోరూం కాంప్లెక్స్ ఒప్పందంతో నెలకు రూ.17.22 లక్షల అద్దెను చెల్లించనున్నట్టు తెలిసింది. ఢిల్లీలో ఏరోసిటీ హాస్పిటాలిటీ డిస్ట్రిక్ట్‌లో ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో 8,200 అడుగుల వాణిజ్య స్థలాన్ని టెస్లా లీజుకు తీసుకున్నది. ఆ స్థలానికి సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.1.03 కోట్లు చెల్లించినట్టు తెలిసింది.
Tesla: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్ ఈ టెస్లా కార్ల కంపెనీకి యాజమాని. ఆయనకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మరికొన్ని ప్రముఖ కంపెనీలు ఉన్నాయి. ఈ టెస్లాతోపాటు స్పేస్ ఎక్స్, ఎక్స్ (ట్విట్టర్)తో పాటు పలు ప్రముఖ కంపెనీలను ఆయన నిర్వహిస్తున్నారు. మరికొన్నింటిలో భాగస్వామిగా కూడా ఉన్నారు. డ్రైవర్ లెస్ కార్లు అయిన ఈ టెస్లా కార్లకు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక డిమాండ్ ఉన్నది. అయితే ధరలు కూడా అధికంగా ఉండటంతో ఇప్పుడిప్పుడే కొనుగోళ్లలో ఊపందుకుంటున్నాయి.