Kantara: కాంతార సినిమా అందరి మనసులను గెలిచిన విషయం తెలిసిందే. కానీ, ఈ సినిమాలో నటించిన కొందరు నటుల వరుస మరణాలు ఇప్పుడు షాకింగ్‌గా మారాయి. తాజాగా మరో నటుడు అనుమానాస్పద స్థితిలో మరణించడంతో ఈ విషయం మరింత హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: Allu Arjun: అల్లు అర్జున్‌ను గుర్తుపట్టని సెక్యూరిటీ.. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఘటన
కాంతార సినిమాలో నటించిన నటుల వరుస మరణాలు సినీ పరిశ్రమలో కలకలం రేపుతున్నాయి. తాజాగా, నాటక కళాకారుడు టి. ప్రభాకర్ కళ్యాణి హిరియాడ్కాలోని తన ఇంట్లో కుప్పకూలి మరణించారు. బ్యాంక్ ఆఫ్ బరోడా రిటైర్డ్ అధికారిగా, కాంతారలో న్యాయవాది పాత్రలో నటించిన ఆయన, ఇంట్లో జారిపడి చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే, అనూహ్యంగా తీవ్రమైన నొప్పితో మరణించారు. గతంలో రాకేష్ పూజారి, కపిల్, కళాభవన్ వంటి నటులు కూడా చిన్న వయసులోనే మరణించారు. ఈ మరణాల వెనుక ఉన్న కారణాలపై ఆందోళన వ్యక్తమవుతోంది.