Ramayan Movie: పురాణ సినిమాలు తీయాలంటే తెలుగువారే తీయాలన్నది ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట. ప్రత్యేకించి రామాయణం ను మనవారు డీల్ చేసినట్లు ఎవరూ చేయలేకపోయారు. ఒక్క రామానంద్ సాగర్ మినహా. ఆయన కూడా ఎన్టీఆర్ సూచనలకు అనుగుణంగా తీయటం వల్లే అంతటి ఘనవిజయం దక్కిందనే వారు లేకపోలేదు. ఇప్పటికే పలు మార్లు వెండితెర, బుల్లితెరపై అలరించిన ‘రామాయణం’ను మరో సారి నితీశ్ తివారి తెరకెక్కిస్తున్నారు.
Ramayan Movie: అయితే ఇటీవల కాలంలో ప్రభాస్ తో ‘ఆదపురుష్’ తీసి విమర్శలకు లోనయ్యారు ఓం రౌత్. ఈ నేపథ్యంలో అందరి కళ్ళూ నితీశ్ ‘రామాయణం’ పైనే ఉన్నాయి. రాముడుగా రణ్ బీర్, సీతగా సాయిపల్లవి, రావణుడుగా యశ్ నటిస్తున్న ఈ సినిమా రెండు పార్ట్ లు వచ్చే అవకాశం ఉందంటున్నారు. దీనికోసం ప్రత్యేకంగా సెట్ రూపొందిస్తున్నారు. ఈ సెట్ లోనే మూడు వారాల పాటు సాయిపల్లవి పాల్గొనగా కీలక సన్నివేశాలను తీస్తారట. త్వరలోనే సీతగా సాయిపల్లవి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేస్తారట. ఇంకా ఇందులో సన్నీడియోల్, రకుల్ ప్రీత్, లారాదత్తా తో పాటు పలువురు ఉత్తరాది, దక్షిణాది తారలు కీలక పాత్రలో మెరుస్తారట. 2026లో ‘రామాయణం’ తొలి పార్ట్ విడుదల అవుతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి పలు పిక్స్ లీకయ్యాయి. మరి సీతగా సాయిపల్లవి పాత్ర కీలకమైన నేపథ్యంలో ఆమె ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటే సినిమాకు తిరుగుండదు. మరి సాయిపల్లవి సీత పాత్ర సినిమాకు ఏ మేరకు ప్లస్ అవుతుందో తెలియాలంటే ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యేవరకూ ఆగక తప్పదు.
ఇది కూడా చదవండి : తెలుగువారిని ఆకట్టుకుంటున్న శివకార్తికేయన్!
Ramayan Movie: సాయిపల్లవికి ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు . ఆమె కోసమే సినిమా చూసేవారున్నారు . సాయిపల్లవి సినిమా అంటే ఒక క్రేజ్ ఉంది . అయితే , ఇది రామాయణం. ఇందులో సీతగా సాయిపల్లవి ఎంతవరకూ మెప్పించగలదు అనే సందేహాలూ ఉన్నాయి . కానీ , ఆమె అభిమానులు మాత్రం సాయిపల్లవి సీతగా అదిరిపోతోంది అంటున్నారు . ఇక ఇటీవల సాయపల్లవి అమరన్ మూవీతో మెరిసింది . ఈ సినిమా డీసెంట్ హిట్ అయింది . దీపావళికి విడుదలైన సినిమాల్లో ఇది బెస్ట్ మూవీగా నిలిచింది . సాయిపల్లవి నటనకు ప్రేక్షకులు మరోసారి ఫిదా అయిపోయారు . దీంతో సాయిపల్లవి నెక్స్ట్ మూవీపై చాలా అంచనాలు ఉండడం సహజం . పైగా రామాయణం వంటి సినిమాలో సీతగా ఆమె నటిస్తుండడంతో అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి . ఆ అంచనాలకు తగ్గట్టుగా సాయిపల్లవి లుక్ ఉంటుందనే అందరి నమ్మకం .