YS Sunitha

YS Sunitha: పులివెందుల ఎన్నికల్లో వైసీపీ గొడ్డలి పాలిటిక్స్‌?

YS Sunitha: పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ హత్యా రాజకీయాలకు, సరికొత్త డ్రామాలకు తెరలేపుతోందా? వివేకా గొడ్డలి పోటుని రాజకీయ లబ్ది కోసం గుండెపోటుగా మార్చిన అవినాష్ అండ్ టీమ్.. వివేకా సొంత కుమార్తెను సైతం రాంగ్ ట్రాకవ్‌లో నడిపిన అవినాష్ గ్యాంగ్‌పై.. న్యాయం కోసం పోరాడుతున్న సునీత లేవనెత్తుతున్న అనుమానాలివి. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి సురేష్‌పై జరిగిన దాడిపై ఇదే అనుమానం వ్యక్తం చేశారు వైఎస్‌ సునీత. దాడికి గురైన సురేష్‌ తనకు బంధువు అవుతాడని, ఈ దాడి చేయించింది ఎంపీ అవినాష్ రెడ్డే అంటోన్న సునీత.. సేమ్‌ వివేకా హత్య ఘటనలాగే సురేష్‌పై దాడిని టీడీపీ నేతలపైకి తోసేస్తున్నారని ఆరోపించారు. దీనిపై జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌ను కలసి ఫిర్యాదు సైతం చేశారు సునీత రెడ్డి. సునీత వ్యాఖ్యలు ఇప్పుడు పులివెందులలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Also Read: India- America: భార‌త్‌కు ట్రంప్ మ‌రో భారీ షాక్‌! ఇండియా దీటైన వైఖరి

గత రెండు రోజులుగా పులివెందులలో జరిగిన ఘటనలు చూస్తే తన తండ్రి వివేక హత్య గుర్తుకొస్తోందని సునీత వ్యక్తం చేసిన ఆవేదన అందర్నీ కలిచివేస్తోంది. ఎన్నికల్లో గెలుపు కోసం గొడ్డలి పోటును సైతం గుండెపోటుగా మార్చిన ఘనత వారికే దక్కుతుందని, హత్యలో క్రైమ్ సీన్‌ను కూడా తుడిచేసిన ఘనులని, సురేష్ రెడ్డిపై దాడి జరిగిన తీరు చూస్తే తన తండ్రి వైఎస్ వివేకా హత్య గుర్తుకు వస్తోందని అన్నారామె. తండ్రిని కోల్పోయిన వైఎస్ సునీతా మళ్లీ అలాంటి ఘటన చోటు చేసుకోకూడడని జిల్లా ఎస్పీని కలిసారంటే పులివెందులలో పరిస్థితి ఎలా ఉందో ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఎన్నికలు ప్రశాంతంగా జరపాలని పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తోంటే… వారిని సైతం వదలట్లేదు వైసీపీ శ్రేణులు. నేడు వైఎస్ సునీతా ఆవేదన చూస్తున్న పులివెందుల ప్రజలు.. ఆమె పరిస్థితి పగవాడికి కూడా రాకూడదంటూ చర్చించుకుంటున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *