Spirit: సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ‘స్పిరిట్’లో ప్రభాస్ ఓ డైనమిక్ పాత్రలో కనిపించనున్నారు. సంగీత దర్శకుడిగా హర్షవర్ధన్ రామేశ్వర్ పనిచేస్తున్నారు. ఈ చిత్రంలో మొత్తం ఆరు పాటలు ఉంటాయని తాజా సమాచారం. ఒక థీమ్ సాంగ్ ప్రభాస్ క్యారెక్టర్‌ను హైలైట్ చేస్తుందట. మరో పాట ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలను ఆకట్టుకునేలా ఉంటుందని టాక్. అలాగే, రెండు రొమాంటిక్ పాటలు డాక్టర్, కాప్ పాత్రల మధ్య సన్నివేశాలకు జీవం పోస్తాయని సమాచారం. సినిమా కథ, పాత్రలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది!

